విశాఖపట్నంలోని సెయింట్ సోఫియా కళాశాలలో జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ స్వరాజ్ స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధుల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇతర వైద్య విధానాలు శరీరానికి నష్టం చేస్తే, ప్రకృతి వైద్యం శరీరానికి మేలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు ప్రకృతి వైద్యం విలువలను వివరించారు. ప్రాచీన కాలం నుంచి వచ్చిన ప్రకృతి చికిత్సను మహాత్మ గాంధీజీ అనుసరించి ఎన్నో రోగాలకు చికిత్స చేసేవారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: