ETV Bharat / state

విశాఖలోని జాతీయ పరిశోధన అభివృద్ది సంస్థకు జాతీయ మేధో సంపత్తి అవార్డు - విశాఖ

విశాఖలోని జాతీయ పరిశోధన అభివృద్ది సంస్థ(ఎన్​ఆర్​డీసీ)కు 2020సంవత్సరానికి గానూ జాతీయ మేధో సంపత్తి అవార్డు లభించింది. ఈ సంస్థ మేనేజర్ డాక్టర్ బీకే సాహు ఈనెల 17న దిల్లీలో కేంద్ర మంత్రి నుంచి ఈ అవార్డును అందుకోనున్నారు.

ఎన్​ఆర్​డీసీ
ఎన్​ఆర్​డీసీ
author img

By

Published : Aug 10, 2021, 7:43 PM IST

విశాఖలోని జాతీయ పరిశోధన అభివృద్ది సంస్థ(ఎన్​ఆర్​డీసీ)కు జాతీయ మేధో సంపత్తి అవార్డు-2020 లభించింది. దేశంలో మేధో సంపత్తి హక్కులు వచ్చేందుకు ఉత్తమ ఆవిష్కరణలు చేయడానికి విశేష కృషి చేసిన భారత ప్రభుత్వ పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అధికారులు ప్రతి ఏటా ఈ అవార్డులను బహుకరిస్తారు.

విశాఖ కేంద్రం ప్రాంతీయ మేనేజర్ డాక్టర్ బీకే సాహు ఈనెల 17న దిల్లీలో కేంద్ర మంత్రి నుంచి ఈ అవార్డును అందుకోనున్నారు. దక్షిణాదిలో పేటెంట్లు పొందేందుకు యువ ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చి వారికి మేధో హక్కులు పొందేందుకు ఈ సంస్ధ సహకారం అందిస్తోంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఈ కేంద్రం ద్వారా మేధో హక్కులు పొందగలిగారు. దిల్లీ తర్వాత బయట ఏర్పాటైన సంస్థ ఇదే కావడం విశేషం.

ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు పని తీరు సంతృప్తికరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.