రానున్న ఐదేళ్లలో విశాఖ జిల్లాలో దాదాపు లక్ష కోట్ల రూపాయల అంచనాతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రతిపాదనలు తయారుచేసినట్టు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. ప్రధానమంత్రి జాతీయ మౌలిక సదుపాయాల మిషన్ కింద చేపట్టాల్సిన పనులను సంతృప్త విధానంలో ప్రతిపాదించాలని...కేంద్ర ప్రభుత్వం కోరినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఈ ప్రతిపాదనలు సమర్పించామని... అక్కడ పరిశీలన తర్వాత నేరుగా కేంద్రానికి పంపుతారని వివరించారు.
ఇవీ చదవండి...'ఆంధ్ర విశ్వవిద్యాలయం టాప్-5లో నిలవాలి'