నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, జిల్లాస్థాయిలో ఉత్తమ ఓటరు నమోదు అధికారిగా ( ఈఆర్ఓ) పురస్కారం దక్కించుకున్నారు. ఈ అవార్డును జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి 2021లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం నిర్ణీత సమయంలో సమర్థవంతంగా పూర్తి చేసినందుకు ఈ అవార్డు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సబ్ కలెక్టర్గా మౌర్య విధుల్లోకి చేరిన అనతికాలంలోనే ఈ పురస్కారం దక్కించుకున్నారు.
ఇదీ చదవండీ... విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్