ప్రభుత్వ ఆదేశాల మేరకు... ఈ ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని విశాఖ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సందీప్ అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో... రెవెన్యూ, గృహనిర్మాణ సిబ్బంది, ఎన్జీఆర్ఎస్ అధికారులతో సందీప్, ఆర్డీవో గోవిందరావు సమావేశమయ్యారు. గ్రామాల్లో ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన లేఅవుట్లలో రహదారి నిర్మాణం, డ్రైనేజీలు ఇతర సామాజిక అవసరాలకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. నిర్దేశించిన గ్రామాల్లో ఈనెల 29న దీనిని చేపట్టాలని ఆర్డీవో తెలిపారు.
ఇదీ చదవండి: