Life Skills and Human Development book: విద్యార్థుల సమగ్ర వికాసానికి జీవిత నైపుణ్యాలు చాలా అవసరమని.. అవీ వ్యక్తిగత, వృత్తిపరమైన విజయానికి విద్యార్థులను సిద్ధం చేస్తాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు శ్రీ ఎన్.ఆర్.నారాయణ మూర్తి అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ కృష్ణ మోహన్, ఆంధ్రా యూనివర్సిటీ సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ సంయుక్తంగా రచించిన “లైఫ్ స్కిల్స్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్” పుస్తకాన్ని నారాయణ మూర్తి విడుదల చేశారు.
సాఫ్ట్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్‌పై పరిశోధన చేసినందుకు ఇద్దరు రచయితలను నారాయణ మూర్తి అభినందించారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. లైఫ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలని తెలిపారు
వైస్‌ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. సాఫ్ట్ స్కిల్స్‌లో కోడింగ్ తప్పనిసరని, అన్ని స్థాయిల విద్యలోనూ దీన్ని తప్పనిసరి చేయాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ. కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. మానవ వికాసం అనేది మానసిక, శారీరక శ్రేష్ఠత చుట్టూ కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బీలా సత్యనారాయణ, ప్రొఫెసర్ కె సమత, ప్రొఫెసర్ బీ మోహన్ వెంకట్రామ్, ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్, డాక్టర్ కుమార్ రాజా, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: