తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావు దీక్షకు ఆయన సంఘీభావం తెలపనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత నాలుగు రోజులుగా పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు ఆమరణ నిరహార దీక్ష చేయనున్నట్లు పల్లా శ్రీనివాసరావు గతంలోనే స్పష్టం చేశారు.
ఇవీ చూడండి... కొనసాగుతున్న 'పల్లా' ఆమరణ దీక్ష... ఉడుకుతున్న 'ఉక్కు' నగరం