ETV Bharat / state

నాడు ఆర్థిక రాజధానిగా విశాఖ - నేడు అఘాయిత్యాలకు క్యాపిట‌ల్: లోకేశ్​ - Lokesh on YCP Government

Nara Lokesh Tweet on YSRCP Government: వైఎస్సాస్సీపీ ప్రభత్వంపై ట్విటర్(X)​ వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శల వర్షం కురిపించారు. విశాఖ‌లో బాలిక‌పై జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోందని అన్నారు. అధికారమ‌దం త‌ల‌కెక్కిన ఎమ్మెల్యే బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి శ్రీకాళ‌హ‌స్తి స‌న్నిధిలోనే పాపాల‌కు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు.

Nara_Lokesh_Tweet_on_YSRCP_Government
Nara_Lokesh_Tweet_on_YSRCP_Government
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 5:21 PM IST

Nara Lokesh Tweet on YSRCP Government : వైఎస్సాస్సీపీ ప్రభత్వంపై ట్విటర్(X)​ వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శల వర్షం కురిపించారు. పాపాల పాల‌కులు ప్రశాంతమైన‌ విశాఖ పాలిట శాపంగా మారారని నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. రాజ‌ధాని చేస్తామ‌ని విశాఖ న‌గ‌రాన్ని నేరాలు-ఘోరాల‌కు అడ్డా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ‌లో బాలిక‌పై జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోందని అన్నారు. సీఎం ఇంటి ప‌క్కనే యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగితే నేటి వ‌ర‌కూ నిందితుడ్ని ప‌ట్టుకోలేదని దుయ్యబట్టారు.

అఘాయిత్యాలకు క్యాపిట‌ల్: తెలుగుదేశం పాల‌న‌లో ఆర్థిక‌ రాజ‌ధానిగా విశాఖ‌ను ప్రమోట్ చేశామని నారా లోకేశ్ గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ విశాఖ‌ను అఘాయిత్యాలకు క్యాపిట‌ల్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస పాల‌న‌లో ర‌క్షణ‌ లేని బాలిక‌లు, మ‌హిళ‌లకు కుటుంబ‌ స‌భ్యుడిగా తనదో ఓ విన‌తి అని, మూడు నెల‌ల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేర‌గాళ్ల రాజ్యం అంతం అవుతుందని, ప్రజా ప్రభుత్వం వ‌స్తుందని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ బాలికల, మ‌హిళ‌ల ర‌క్షణ బాధ్యత తీసుకుంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.

  • పాపాల పాల‌కులు ప్ర‌శాంతమైన‌ విశాఖ పాలిట శాపంగా మారారు. రాజ‌ధాని చేస్తామ‌ని విశాఖ న‌గ‌రాన్ని నేరాలు-ఘోరాల‌కి అడ్డా చేశారు. విశాఖ‌లో బాలిక‌పై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. సీఎం ఇంటిప‌క్క‌నే యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగితే నేటివ‌ర‌కూ నిందితుడ్ని ప…

    — Lokesh Nara (@naralokesh) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జగన్ ప్రభుత్వంలో మహిళలను వేటాడే నేరస్తులకు మాత్రమే సాధికారత : చంద్రబాబు

Nara Lokesh Fire on YSRCP MLA Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పురావ‌స్తు, దేవాదాయ శాఖ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో త‌వ్వకాలు చేప‌ట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చారిత్రక‌, పురావ‌స్తు, ఆధ్యాత్మిక సంప‌ద ధ్వంసం చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధమే కాదు, పాపమని అన్నారు. శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో త‌వ్వకాల‌కు కారణమైన వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని లోకేశ్ డిమాండ్ చేశారు. చేసిన పాపాలు పోవాల‌ని, స‌న్మార్గంలో న‌డిచేలా దీవించాల‌ని భ‌క్తులంతా శ్రీకాళ‌హ‌స్తీశ్వర స్వామిని వేడుకుంటారని అన్నారు.

ఏళ్ల నాటి చారిత్రక కట్టడాల‌ను కూల్చేస్తున్నారు : అధికారమ‌దం త‌ల‌కెక్కిన ఎమ్మెల్యే బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి మాత్రం శ్రీకాళ‌హ‌స్తి స‌న్నిధిలోనే పాపాల‌కు పాల్పడుతున్నాడని నారా లోకేశ్ దుయ్యబట్టారు. స్వామి, అమ్మవార్లకే అప‌చారం త‌ల‌పెడుతున్నాడని ఆరోపించారు. పురాత‌న శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు త‌యారు చేసే గ‌ది, మృత్యుంజ‌య పూజ‌లు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాల‌ను కూల్చేయిస్తున్నాడని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • చేసిన పాపాలు పోవాల‌ని, స‌న్మార్గంలో న‌డిచేలా దీవించాల‌ని భ‌క్తులంతా శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌ర స్వామిని వేడుకుంటారు. అధికారమ‌దం త‌ల‌కెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి మాత్రం శ్రీకాళ‌హ‌స్తి స‌న్నిధిలోనే పాపాల‌కు పాల్ప‌డుతున్నాడు. స్వామి, అమ్మ‌వార్ల‌కే అప‌చారం త‌ల… pic.twitter.com/cQIFi6hHF1

'సీఎం జగన్ అండ్ టీం దండుపాళ్యం గ్యాంగ్ - ఏపీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి'

YSRCP Government Failure in AP : వచ్చే ఎన్నికల్లో జరగబోయేది జగన్ అహంకారానికి, జనం ఆత్మ గౌరవానికి మధ్య జరిగే యుద్ధం నారా లోకేశే ట్వీట్(X) చేశారు. విధ్వంసానికి ముగింపు పలకాలని అన్నారు.

Nara Lokesh Fire On Cm Jagan: జగన్ పాలనలో గంటకో కిడ్నాప్.. పూటకో రేప్.. రోజుకో మర్డర్: నారా లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.