ETV Bharat / state

వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది! - అక్రమ సంబంధం

వివాహేతర సంబంధం అతని ప్రాణం తీసింది. "పదేళ్లుగా నా ఆస్తినంతా అంతా మీకె పెట్టాను" అన్న మాటే పాపం అయ్యింది. విశాఖ జిల్లా గొలుగొండ మండలంలోని జిల్లేడు పూడి గ్రామంలో గిరిబాబు అనే వ్యక్తి పెట్టుకున్న వివాహేతర సంబంధం.. చివరికి అతడి ప్రాణం తీసింది.

MURDER
అక్రమ సంబంధం .... ఆస్తీ..ప్రాణం రెండు తీసుకుపోయింది.
author img

By

Published : Jul 29, 2021, 2:08 PM IST

విశాఖ జిల్లా గొలుగొండ మండల పరిధిలో.. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొంత కాలంగా అతను ఓ మహిళతో వివాహేతర సంబంధం నడిపించాడు. చివరికి ఆ మహిళ కుమారుడి చేతిలోనే హతమయ్యాడు. మృతుడిని గిరిబాబు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లేడుపూడి గ్రామంలో పూల వ్యాపారం చేసిన గిరిబాబు.. అదే గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. అప్పటికే లక్ష్మికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో లక్ష్మి గురించి ఇరుగుపొరుగు చేసే వ్యాఖ్యలతో ఆమె కుమారులు మనస్థాపానికి గురయ్యారు. తమ ఇంటికి రావద్దని గిరిబాబుతో ఇటీవల లక్ష్మి రెండో కుమారుడు రాజబాబు గొడవపడ్డాడు.

వాదనతో ఆవేశానికి గురైన గిరిబాబు.. గత పదేళ్లుగా తన ఆస్తిని సర్వస్వాన్ని లక్ష్మి కోసమే ఖర్చు చేస్తున్నట్టు వ్యాఖ్యానించగా.. లక్ష్మి రెండో కుమారుడు మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. గిరిబాబును రాజబాబు చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన గిరిబాబు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నర్సీపట్నం గ్రామీణ సర్కిల్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

ఇదీ చదవండి:

Prank Video Failed : ప్రాంక్ వీడియో కాస్తా.. ఫైట్ వీడియో అయింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.