మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఛైర్మన్ పదవిని ఎస్సీ మహిళలకు కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అధికార పార్టీతో పాటు.. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. నర్సీపట్నంలో మొత్తం 47,838 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 28 వార్డులకు 56 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు.