మాదిగల అభివృద్ధిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అడ్డుకుంటున్నారని... మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ విశాఖలో అన్నారు. మాదిగల అభివృద్ధి కోసం వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే... మందకృష్ణ వాటిని అడ్డుతగులుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై చర్చించేందుకు మందకృష్ణను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆహ్వానిస్తే...ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఎస్సీ వర్గీకరణ సహ మాదిగల అభివృద్ధి విషయంలో...ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: "ఆదివాసీలపై మారణకాండ సరికాదు"