జగన్ పాలనలో పరిపాలనా రాజధాని విశాఖకు రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. తిమ్మాపురం అతిథి గృహంలో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలో తెదేపాకు ఒక్క సీటు కూడా రాదని, ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధ్యాయం ముగుస్తుందని అన్నారు.
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ వైకాపా గేట్లు తెరిస్తే తండ్రి, కొడుకు తప్ప తెదేపాలో ఎవ్వరూ మిగలరని వ్యాఖ్యానించారు. మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓట్ల కోసం వైకాపా నేతలు అన్నిచోట్లా తిరగక్కర్లేదని, సీఎం జగన్ బొమ్మ ఉంటే చాలని అన్నారు. గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి, స్టీలుప్లాంటు కార్మికసంఘ నేత మంత్రి రాజశేఖర్, వైకాపా నేతలు మళ్ల విజయప్రసాద్, కేకే రాజు, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: