ETV Bharat / state

'రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది' - gvl narasimharao updates

ఆంధ్రప్రదేశ్​కు నాలుగు పారిశ్రామిక నగరాలను ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనని భాజపా నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంపై పౌర గ్రంథాలయంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైల్వే మంత్రితో మాట్లాడి రాష్ట్రానికి పూర్తిస్థాయి న్యాయం చేస్తామని తెలిపారు.

జీవీఎల్ నరసింహారావు
జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Mar 2, 2021, 6:43 AM IST

'కేంద్రం...రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది'

కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో దశాబ్దాల కల - దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనే అంశంపై... పౌర గ్రంథాలయంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే మంత్రితో మాట్లాడి రాష్ట్రానికి పూర్తి స్థాయి న్యాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​కు నాలుగు పారిశ్రామిక నగరాలను ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

రైల్వే జోన్ సాధన.. భాజపా ప్రభుత్వం వల్లే సాకారమైందని జీవీఎల్ చెప్పారు. విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం పరిశీలించాలని మాత్రమే ఉందని, కానీ భాజపా చొరవతోనే వచ్చిందని స్పష్టం చేశారు. రెండు పూర్తి స్థాయి గూడ్స్ కారిడార్స్ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. దేశంలో మొట్టమొదటి స్మార్ట్ సిటీగా విశాఖను ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. వాల్తేరు రైల్వే డివిజన్ తిరిగి కొనసాగించే అంశంపై కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్తనని హామీ ఇచ్చారు.

విశాఖ అభివృద్ధిలో భాజపా పాత్ర ఉందని శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు .విశాఖలో రైల్వే జోన్ కోసం 20 ఏళ్లగా పోరాటం జరిగిందని,18వ జోన్​గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లోదక్షిణ కోస్తా రైల్వేకు రూ.170 కోట్లు కేటాయించారని చెప్పారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్ ప్రీమియం లీగ్ టీ-20 విజేత రిచ్ మండ్ రైడర్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.