విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి ఉంటే... ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైపుణాభివృద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతకు నైపుణాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా హెచ్పీసీఎల్ అనకాపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. యువత ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ ప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి