ETV Bharat / state

వీడిన మిస్టరీ... కన్నతల్లే హంతకురాలు

మూడు రోజుల క్రితం విశాఖలో జరిగిన యువకుడి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కన్నతల్లే తన కూతుర్లు, అల్లుళ్ల సహాయంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మహారాణిపేట పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

mothre-murdered-her-son-in-vizag
విశాఖలో హత్య
author img

By

Published : May 27, 2021, 10:58 PM IST

విశాఖ నగరం తాడివీధిలో నివాసముంటున్న టేకుమూడి సుగుణ, రాంబాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పదేళ్ల క్రితం రాంబాబు చనిపోయాడు. పెద్ద కుమార్తె ప్రసాద్ గార్డెన్స్​లో, చిన్న కుమార్తె అరిలోవలో నివాసముంటున్నారు. కుమారుడు టేకుమూడి శ్యామ్ కుమార్ తల్లి సుగుణ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన శ్యామ్... డబ్బులు ఇవ్వాలంటూ తల్లి సుగుణను వేధించేవాడు. శ్యామ్ ప్రవర్తనతో విసుగు చెందిన సుగుణమ్మ అతనిని అంతమొందించాలని పథకం రచించింది.

తాడుతో ఉరి బిగించి...

యథాప్రకారం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని శ్యామ్... తల్లి సుగుణమ్మను వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుగుణమ్మ తన కూతుళ్లు, అల్లుళ్లకు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ముందస్తు పథకం ప్రకారం శ్యామ్ కాళ్లు చేతులను గట్టిగా పట్టుకుని తాడుతో మెడ బిగించి మొహంపై దిండు పెట్టి హత్య చేశారు.

స్థానికుల అనుమానంతో...

అనంతరం ఏమీ ఎరగనట్లు ఏడుస్తూ దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా... అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్​కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... కన్నతల్లే శ్యామ్​ను హత్య చేసినట్లు నిర్ధరించారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీచదవండి.

TTD: 'గోవిందానంద సరస్వతికి సంస్కృతంలో పరిజ్ఞానమే లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.