వాగులో కొట్టుకుపోయి తల్లీకొడుకు(mother and son swept away in flash floods ) మృతిచెందిన విషాద ఘటన విశాఖ ఏజెన్సీలో జరిగింది. విశాఖ మాన్యంలో కొండవాగు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పెదబయలు మండలం చీకటిపల్లికి చెందిన రాములమ్మ కొడుకు ప్రశాంత్‌తో కలిసి జి. మాడుగుల మండలం మద్దిగరువులోని వారపు సంతకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చీకుపనస వద్ద కొండవాగులో ఒక్కసారిగా పైనుంచి వరద రావడంతో తల్లీకొడుకులు కొట్టుకుపోయారు. గ్రామస్తులు తల్లీ కొడుకుల మృతదేహాలను వెలికి తీశారు. మారుమూల మన్యంలో నిత్యం ఇలాంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
ఇదీ చదవండి..