ETV Bharat / state

నర్సీపట్నంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా - అధికారులు చర్యలు తాజా వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఒక్కరోజే 13 కేసులు నమోదు కావడం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యుడితోపాటు పోలీస్​ సిబ్బందికి, రెండు రోజుల పసికందుకు, బాలింతకు సైతం కరోనా నిర్ధరణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

more corona cases recorded
నర్సీపట్నంలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jul 19, 2020, 9:26 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉధృతి అధికమవుతోంది. పట్టణంలో ఈరోజు ఒక్కరోజే 13 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలోని వైద్యుడికి కరోనా పాజిటివ్​ రావడం, కొంతమంది పోలీసులతో పాటు రెండు రోజుల పసికందుకి, బాలింతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే 3, 4, 9, 5, 26 వార్డులతో పాటు సీబీఎం కాంపౌండ్, బీ.సీ.కాలనీ, శారద నగర్, ఎస్సీ కాలనీ, కాపు వీధి, రామారావు పేటలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వ్యాపార సంస్థలు పాక్షిక లాక్​డౌన్​ ప్రకటించింది. దీనికితోడు అధికారులు అప్రమత్తమై నివారణకు పక్కా చర్యలు చేపడుతూనే.. మరోపక్క కేసులు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇవీ చూడండి...

విశాఖ మన్యంలో యువకుని హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.