ETV Bharat / state

పెరిగిన రేషన్ ధరలు.. డిసెంబర్ నుంచి డబ్బులు కట్టి తీసుకోవాల్సిందే..

డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రజలు డబ్బులు చెల్లించి రేషన్ తీసుకోవాలి. కరోనా కారణంగా నవంబర్ వరకు ప్రభుత్వం ఉచితంగా సరకులు పంపిణీ చేసింది. అలాగే రేషన్ సరకుల ధరలు పెరిగాయి. కిలో కందిపప్పురూ. 67, పంచదార అరకిలో రూ. 17, బియ్యానికి కిలో రూపాయి చెల్లించి సరకులు తీసుకోవాలి.

ration distribution in ap
ఏపీలో రేషన్ పంపిణీ
author img

By

Published : Nov 30, 2020, 7:40 PM IST

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ సరకుల పంపిణీ నవంబరుతో ముగిసింది. డిసెంబర్ నుంచి యథావిధిగా డబ్బులు చెల్లించి రేషన్ తీసుకోవలసి ఉంటుంది. అయితే గతంలో కంటే వాటి ధరలు ప్రస్తుతం పెరగనున్నాయి. బియ్యం కిలో రూపాయికే ఇస్తున్నప్పటికీ కందిపప్పు, పంచదార రేట్లు భారీగా పెరిగాయి. 4 నెలల క్రితమే వీటి ధరలు పెంచినా.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఉచిత పంపిణీ చేశారు. డిసెంబర్ నుంచి పెరిగిన ధరలతో ప్రజలు రేషన్ తీసుకోవాలి.

విశాఖ జిల్లాలో పెరిగిన రేషన్ ధరలతో ప్రజలపై రూ. 4.37 కోట్ల భారం పడనుంది. జిల్లాలో 13,03,528 మంది లబ్ధిదారులు ఉన్నారు. కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వనున్నారు. కిలో కందిపప్పుకు రూ. 67, పంచదారకు రూ. 17లు చెల్లించాలి. అంతకుముందు కందిపప్పు కిలో రూ. 40లు ఉండగా.. రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది. పెరిగిన ధరలతో ఒక్కో కార్డుపై సగటున రూ. 34 అదనపు భారం పడనుంది. ఏవై కార్డుదారులకు ఎప్పటిలాగే అరకిలో పంచదార రూ. 13.50కు ఇవ్వనున్నారు.

పెరిగిన ధరలతో కందిపప్పు కొనేందుకు లబ్ధిదారులు సముఖంగా ఉండరేమోనని రేషన్ డీలర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో దీనికంటే రూ. 20, 30లు మాత్రమే ధర వ్యత్యాసం ఉంది. పైగా చౌకదుకాణంలో ఇచ్చే కందిపప్పు నాణ్యత సరిగ్గా లేదని కార్డుదారులు అంటున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తెలుపు కార్డుల స్థానంలో బియ్యం కార్డులు ఇచ్చింది. ఉచిత సరకులు కార్డు ఉన్నవారందరికీ ఇచ్చినా.. ఇకపై బియ్యం కార్డు దారులకే సరకులు పంపిణీ చేయనున్నారు. దీనివల్ల సుమారు 1.2 లక్షల మంది రేషన్ దుకాణాలకు దూరం అవ్వనున్నారు.

ఇవీ చదవండి:

చుక్కపల్లిలో.. చుక్కలు చూపించిన 10 అడుగుల కొండచిలువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.