ఓకే రేషన్ కార్డులో ఉన్న తల్లీకూతుళ్లకు పింఛను నిలిపివేతపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు. విశాఖపట్నం సింహాద్రిపురం కాలనీకి చెందిన కంటిబుక్త అప్పల నరసమ్మ (110), కంటిబుక్త లక్ష్మి (80) ఇరువురూ ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. అప్పల నరసమ్మ 100 రూపాయల నుంచి పింఛన్ తీసుకుంటూ వస్తోంది. కొన్నినెలలుగా వేలిముద్ర పడటం లేదని పింఛన్ ఆపేశారు. ఆమె కుమార్తె లక్ష్మికి కూడా గత నెల నుంచి పింఛను నిలిపివేశారు. ఈ సమస్యపై ఈటీవీ భారత్-ఈనాడులలో కథనాలు రావడంతో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి స్పందించి.. వారిని పరామర్శించారు.
పింఛన్ నిలిచిపోయిన తల్లీకూతుళ్లకు ఎమ్మెల్యే వెలగపూడి సాయం అందించారు. సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా తాను పింఛన్ డబ్బులు ఇస్తానని మాట ఇచ్చారు. అంతేగాకుండా ఈ నెల మొత్తాన్ని వారికి అందజేశారు. కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. పింఛను వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి తన వ్యక్తిగత అవసరాల కోసం.. చాలామంది పింఛన్లు నిలిపివేశారని ఎమ్మెల్యే విమర్శించారు.
ఇదీ చదవండీ.. LIVE VIDEO: చేపలు పట్టేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోతున్న అతనిని..