తెలుగుదేశం తరఫున గెలిచి వైకాపా పంచెన చేరిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆధిపత్య పోరుతో అక్కడ ఉక్కపోతకు గురవుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌తో గణేశ్‌కు పడడంలేదు. విజయసాయిరెడ్డి పేరు అడ్డుపెట్టుకుని సీతంరాజు సుధాకర్.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాసుపల్లి గణేశ్ బాహాటంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. రాజ్యసభ సభ్యుల వల్ల జగన్ మళ్లీ సీఎం కాలేరని, ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డికీ ఈ సందర్భంగా చురకలు అంటించారు.
ఉత్తరాంధ్ర వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేసిన విజయసాయికి.. ఈ విషయం ఎందుకు అర్థం కాలేదో తెలియలేదన్న గణేశ్.. కాత్తగా వచ్చిన సుబ్బారెడ్డైనా సమస్య పరిష్కరించాలని ఆకాంక్షించారు. నగరంలోని ఓ ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన గణేశ్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్‌తో విభేదాలు ఉన్నాయా ? అని విలేకరులు ప్రశ్నించగా గణేశ్ పైవిధంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇవీ చూడండి :
ఆ పుస్తకం తెదేపా వారికే వర్తిస్తుంది: హోంమంత్రి వనిత
ప్రభుత్వాసుపత్రుల్లో వైకాపా పెద్దల అవినీతి రాజ్యమేలుతోంది: తెదేపా నేత గోరంట్ల