విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించారు. నర్సీపట్నం వైద్యపరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనీ.. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందనీ.. ఇందుకోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. దీనికోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం పేదలకు వైద్యం అందించే విషయంలో తగిన సహాయం చేయాలని.. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యలకు సూచించారు.
ఇదీ చదవండి: రావికమతంలో భారీ చోరీ...13 తులాల బంగారం అపహరణ