గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా.. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. అనంతరం మత్స్యకారులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని వారికి అందజేశారు.
ఇదీ చదవండి: విశాఖలో అక్రమ గోకార్టింగ్ నిర్మాణాల కూల్చివేత