విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సీఎం జగన్కు లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమనిధిని వేరే అవసరాలకోసం వాడొద్దని కోరారు. సంవత్సర కాలంగా నష్టపోయి కష్టపడుతున్న కార్మికులను ఆదుకోవాలన్నారు.
ఇప్పటికే ఇసుక కొరత కారణంగా ఆరు నెలలు పాటు నిర్మాణ రంగం కుదేలయిందని చెప్పారు. కరోనా కారణంగా దాదాపు ఫిబ్రవరి నుంచి కార్మికులు పనులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చూడండి:
మెమో 155 సస్పెండ్పై అన్ ఎయిడెడ్ స్కూల్స్ హైకోర్టులో పిటిషన్