విశాఖ జిల్లా గవర కంచరపాలెంలో దాడికి గురైన తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి శరగడం రాజశేఖర్‌ను ఎమ్మెల్యే గణబాబు పరామర్శించారు. రాజశేఖర్‌పై దుండగులు రాళ్లతో దాడి చేయటం అన్యాయమన్నారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు చేయమని చెప్పటం, సంక్షేమ పథకాలు ఇవ్వకపోవటం ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే వైకాపా దాడులకు పాల్పడుతోంది: చంద్రబాబు