విశాఖ జిల్లా నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వైయస్సార్ చేయూత కింద సుమారు 30 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్.. లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 14 నెలల్లోనే 90% శాతం వైకాపా ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు.
మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. వైకాపా నాయకులు, మహిళా సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: