మిజోరం నూతన గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు సతీ సమేతంగా .. విశాఖ సింహాచల శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలుకుతూ, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. తనను గవర్నర్ గా నియమించినందుకు... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు హరిబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లోని మిజోరం ప్రగతికోసం స్వామివారి ఆశీస్సులు కోరారనని హరిబాబు చెప్పారు. స్వామివారి ఆశీస్సులు తీసుకెళ్లడానికే సింహాచలం వచ్చానని చెప్పుకొచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. మన సింహాచలం శ్రీవరాహనరహసింహస్వామి అని కొనియాడారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను హరిబాబుకు అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు వివరించారు.
ఇదీ చదవండి: