Minister Rajini: మూడు రాజధానుల విషయంలో ఎవరెన్ని కుట్రలు చేసినా వెనుకడుగేసే ప్రసక్తే లేదని మంత్రి విడదల రజిని తేల్చిచెప్పారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో జగనన్న మెగా కాలనీకి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ వయస్సులో చంద్రబాబు పాదయాత్రలు చేయలేక.. రైతులతో చేయిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ప్రజాప్రయోజనాల కోసమే తప్ప.. చంద్రబాబులా స్వప్రయోజనాలకు కాదన్నారు.
"నవరత్నాలు-అందరికీ ఇళ్లు"లో భాగంగా 596 ఎకరాల భూమిలో సుమారు 17 వేల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు మంత్రి విడదల రజిని. ఈ కాలనీలను సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామని.. మౌలిక వసతుల కల్పనకు మరో ఏడాది పడుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలను ప్రైవేటు సంస్థకు అప్పగించామని.. సకాలంలో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, వీఎంఆర్డీఏ ఛైర్పర్సన్ విజయనిర్మల, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషాతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: