విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్.. కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న కూరగాయల దుకాణాల్లో ధరలను ఎమ్మెల్యే ధర్మశ్రీతో కలిసి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయాల్లోనే కూరగాయలు కొనాలని సూచించారు. దుకాణాల్లో సరుకుల ధరలను పెంచి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఇదీ చూడండి: