మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా.. విశాఖ జిల్లా భీమునిపట్నంలోని చిట్టివలసలో వాలంటీర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్, వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. వైకాపా నేతలు, కార్యకర్తలు మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తగరపువలస వర్తక సంఘం ఆధ్వర్యంలో ముత్తంశెట్టిని సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఇవీ చదవండి... 'వైకాపా పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి'