ఐదు గ్రామాల్లోని ప్రజల కోసం ఐదు మెడికల్ టీమ్లు ఏర్పాటు చేశామని మంత్రి బొత్స అన్నారు. బాధిత గ్రామాల్లో 90 శాతం ప్రజలు గ్రామాలకు చేరుకున్నారని తెలిపారు. బాధిత గ్రామాలలో ప్రతి వ్యక్తికి పది వేల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని గుర్తు చేశారు. మరికొన్ని గ్రామాలను బాధిత గ్రామాల్లో చేర్చాలని అడుగుతున్నారని.. వాటిని పరిశీలించనున్నట్లు బొత్స వెల్లడించారు. గ్రామాల్లో ప్రజలు యథావిధిగా పనులు చేసుకోవచ్చని.. ప్రజలు అభద్రతకు గురికావద్దని.. బొత్స అన్నారు.
ఇదీ చదవండి: గ్యాస్ లీకేజ్ పరిసర గ్రామాల్లో మంత్రుల బస