ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఆర్మ్‌డ్ మిలీషియా కమాండర్ కొర్రా మల్లేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ ననుబరి గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు 2012 నుంచి మిలీషియా కమాండర్‌గా పని చేస్తున్నాడని జి.మాడుగుల సీఐ దేముడుబాబు తెలిపారు. ఆగస్టు 2న పెదబయలు అటవీ ప్రాంతంలో పోలీసులను చంపాలనే ఉద్దేశంతో మందుపాతరను అమర్చిన వారిలో మల్లేశ్వరరావు ఉన్నాడని చెప్పారు. ఇన్‌ఫార్మర్ పేరిట గిరిజనులను హతమార్చిన ఘటనల్లో పాల్గొన్నాడని తెలిపారు.
మావోయిస్టు వంతాల ప్రభాకర్ అలియాస్ అశోక్, సుధీర్ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో గంజాయి వ్యాపార లావాదేవీలు చేసేవాడని సీఐ చెప్పారు. పోలీసుల సమాచారం మావోయిస్టులకు చేరవేయడం, వారికి కావాల్సిన సామగ్రి వారపు సంతల నుంచి సేకరించి అందజేసేవాడని సీఐ తెలిపారు. ఇతడిని సోమవారం పట్టుకున్నామని, మంగళవారం రిమాండ్‌కు తరలించామని సీఐ దేముడుబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ