ETV Bharat / state

డెక్కన్ పరిశ్రమ వద్ద వలస కార్మికుల నిరసన

తమను స్వస్థలాలకు పంపించాలని విశాఖ జిల్లా రాజవరం డెక్కన్ ఎరువుల పరిశ్రమ వద్ద పశ్చిమ బంగా నుంచి వచ్చిన వలస కార్మికులు నిరసన చేపట్టారు. అనుమతులు వచ్చిన తర్వాత ప్రాంతాలకు పంపిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

migrants protest at deccan factory near payakarao pet
డెక్కన్ పరిశ్రమ వద్ద వలస కార్మికుల నిరసన
author img

By

Published : May 12, 2020, 10:19 AM IST

విశాఖ జిల్లా రాజవరం డెక్కన్ ఎరువుల పరిశ్రమ వద్ద నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమను తమ రాష్ట్రానికి పంపించాలంటూ ధర్నా చేశారు. పశ్చిమ బంగాకు చెందిన కొంతమంది కార్మికులు డెక్కన్ ఎరువుల పరిశ్రమలో నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇక్కడ ఇరుక్కు పోయారు. తమ రాష్ట్రానికి వెళ్లి పోతామని రోడ్డు బాట పట్టిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు వచ్చిన తర్వాత ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వలస కార్మికులు శాంతించారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.