భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో జరిగింది. గడుగుపల్లికి చెందిన తామర్ల త్రినాథ్‌కు ఏడాది కిందట వివాహం జరిగింది. నెలరోజుల కిందట అతని భార్య బాబుకు జన్మనిచ్చింది. అనంతరం పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. అత్తగారింటికి వెళ్లిన త్రినాథ్ భార్యను ఇంటికి తీసుకెళ్తాననగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన త్రినాథ్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతణ్ని స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తోడుగా ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సీహెచ్‌సీపై రోగి బంధువులు దాడి.. వైద్యసిబ్బంది ఆందోళన