విశాఖ స్టీల్ ప్లాంట్ అతి తక్కువ ధరకే మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోందని ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి రామచంద్రరావు ప్రశంసించారు. దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాల కంటే తక్కువ ధరకే వైద్య అవసరాలకు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణ వాయువును అందిస్తోందన్నారు. ప్రభుత్వ రంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండటం కారణంగానే... తక్కువ ధరకు ఆక్సిజన్ లభిస్తోందని చెప్పారు.
యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ లోడింగ్..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మెడికల్ ఆక్సిజన్ లోడింగ్ యుద్ధప్రాతిపదికన జరుగుతోందన్నారు. సంస్థ ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో... 24 గంటలు శ్రమిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పాటుపడుతున్నారని ఆయన కొనియాడారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ... విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు.
ఇదీ చదవండి: