ETV Bharat / state

కొవిడ్​ నియంత్రణపై అవగాహన కల్పించాలి: విశాఖ కలెక్టర్​

author img

By

Published : Oct 23, 2020, 1:52 PM IST

విశాఖ జిల్లాలో కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వి.వినయ్​చంద్ తెలిపారు. కొవిడ్ – 19 అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి హోర్డింగ్స్ ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. మెప్మా ఆధ్వర్యంలో నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంఘాలలో ర్యాలీలు నిర్వహించారు. వైరస్​ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

covid awareness programs
కొవిడ్​ నియంత్రణకు అవగాహనా కార్యక్రమాలు

విశాఖ జిల్లాలో కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. నర్సీపట్నం డివిజన్​లోని నాలుగు మండలాల్లో పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ మండలాలు ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నందున తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఐఇసి యాక్టివిటీ ముమ్మరంగా జరుగుతోందని తెలిపారు. జిల్లా, మున్సిపల్, మండల స్థాయిలో ర్యాలీలను నిర్వహించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్​, విమానాశ్రయం, విద్యా సంస్థలు, మసీదులు, చర్చ్​లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్, షాప్స్ నిర్వాహకులను భాగస్వాములను చేసి స్పష్టమైన కార్యాచ‌ర‌ణ అమ‌ల్లో ఉండాల‌న్నారు.

జిల్లా పాలనాధికారి ఆదేశం మేరకు మెప్మా ఆధ్వర్యంలో నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంఘాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భౌతిక దూరం పాటించటం, మాస్కు ధరించటం, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రపరుచుకోవటం, శానిటైజర్ వినియోగించటం మొదలైన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలను ర్యాలీలో ప్రదర్శించారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మ‌త్స్య, వ్య‌వసాయశాఖ కార్యాలయాల్లో కొవిడ్ నివారణకు పాటించవలసిన జాగ్రత్తలు తెలియచేసేలా పోస్టర్లను ఏర్పాటు చేశారు.

హోర్డింగ్స్ ద్వారా జిల్లాలో కొవిడ్ – 19 అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి ప్రచారం చేయాల‌ని కలెక్టర్​ ఆదేశించారు. కంపెనీల సామాజిక బాధ్యత(సియస్ఆర్ ) కార్యచరణ కింద పాఠశాలలు, ఎన్జీఓలకు శానిటైజర్లు సరఫరా చేయాల‌ని ఫార్మా కంపెనీలను కోరతామ‌న్నారు. కరోనా నియంత్రణకు జిల్లాలో చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలంస‌హాని కలెక్టర్​ను అభినందించారు.

ఇదీ చదవండి:

విశాఖ నుంచి దసరాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.