విశాఖ జిల్లా అనకాపల్లిలోని మిరియాల కాలనీలో భారీ చోరీ జరిగింది. 100 తులాల బంగారం, 3.5 లక్షల నగదును దుండగులు అపహరించారు. పట్నాల శంకర్రావు అనే వ్యక్తి కిరాణ దుకాణం నిర్వహిస్తూ..పై అంతస్థులో నివాసం ఉంటున్నాడు. రాత్రి సమయంలో కిరాణ దుకాణంలో ప్రవేశించిన దుండగులు దేవుడి గదిలోని లాకర్లో ఉన్న 100 తులాల బంగారు నగలను, 3.5 లక్షల నగదును అపహరించుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలంలో క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. అనకాపల్లి సీఐ భాస్కరరావు సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు
ఇదీ చదవండి: