హుకుంపేట మండలం శివారు గరుడపల్లి ఒడిశా రాష్ట్రం సరిహద్దులో నిత్యం నాటుసారా రవాణా అవుతోంది. దీనిని గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి నిల్వ ఉంచిన 5400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఒడిశా ప్రాంతం నుంచి మన్యం ముంచంగిపుట్టు మండలం పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాలకు అధిక మొత్తంలో నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయి. నాటుసారా అక్రమ తయారీ కట్టడి చర్యల్లో భాగంగా ఈ దాడులు చేసి నాటుసారా కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి...