ETV Bharat / state

వేదనకు 50 పేజీల అక్షర రూపం.. ఆపై అదృశ్యం!

18 ఏళ్లకే.. వివాహం.. భర్తతో ఏడు అడుగులు వేస్తుంటే.. ఇక ఏడు జన్మల వరకూ.. తోడై నిలుస్తాడు అనుకుంది. అత్తారింట్లో కాలు పెట్టినప్పుడు అత్తను అమ్మలా భావించింది. ఇక జీవితానికి ఇంతకంటే ఏం కావాలి అనుకునేలోపే ఆమె ఆశలన్నీ సమాధి అయిపోయాయి. తన కోసం స్థాయికి మించి అప్పులు చేసిన తల్లిదండ్రులకు చెప్పకుండా ఆమె అదృశ్యమైంది.

married women missing in vishaka
married women missing in vishaka
author img

By

Published : Aug 11, 2020, 11:51 PM IST

అత్తారింట్లో కష్టం.. 50 పేజీల అక్షరరూపం..ఆపై

పద్దెనిమిది ఏళ్లకే ఆమెకు వివాహమైంది. కోటి ఆశలతో అత్తారింటికి వెళ్తే అక్కడ వేధింపులు, భర్త నిరాదరణ ఎదురయ్యాయి. తన పెళ్లిని ఘనంగా చేయటం కోసం తల్లిదండ్రులు చేసిన అప్పులు ఆమెను మరింత వేదనకు గురి చేశాయి. తాను పడ్డ వేదనకు 50 పేజీల అక్షర రూపం ఇచ్చి ఆమె కనిపించకుండా పోయింది.

విశాఖ జిల్లాకు హరిపాలానికి చెందిన ఓ యువతికి 2018లో ఆమెకు పద్దెనిమిదేళ్ల వయసున్నప్పుడు గాజువాకకు చెందిన డొప్ప శ్రీనివాసరావుతో వివాహమైంది. అతడు హైదరాబాద్​లో ఐడీబీఐ బ్యాంక్​లో పనిచేస్తున్నాడు. అప్పుచేసి పెద్ద ఎత్తున బంగారం ఇచ్చి అత్తారింటికి పంపారు ఆమె తల్లిదండ్రులు. అప్పటి నుంచి ఆమెకు ప్రతిరోజు వేధింపులే. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని ఏడాదిన్నర పాటు ఏ విషయం వారి చెప్పనేలేదు. చెప్పిన తర్వాత కూడా కొన్ని రోజులు భర్తతోనే ఉండాలని తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పారు. తన బాధను అక్షరాల రూపంలో 50 పేజీల డెయిరీ నింపింది. అనకాపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్లి... డెయిరీని అక్కడ వదిలేసి వెళ్లిపోయింది.

భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం లేదని, అత్తింట్లోని వాళ్లు తనను తీవ్రంగా వేధించినట్లు ఆమె డెయిరీలో వివరించింది. నేను ఎవరి కోసం బతకాలి.... నా కోసం వెతకొద్దు.... అంటూ ఆమె రాసిన 50 పేజీల డెయిరీ చదివితే కంట నీరు వస్తుంది. అందులోని ప్రతి అక్షరం తల్లిదండ్రులు, అత్తింటి వారిని వేడుకుంటూ తాను పడ్డ వేదనకు అక్షర రూపం ఇచ్చింది బాధితురాలు. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగు పెడితే.. ఆశలన్నీ అడియాశలయ్యాయని డెయిరీలో పేర్కొంది.

గాజువాక పోలీస్ స్టేషన్​లో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆమె అదృశ్యమై నాలుగు రోజులు గడిచినా ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆమె కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ ప్రాజెక్టులకే కొత్త ఆయకట్టు: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.