ఇదీ చదవండి:
మావోయిస్టులపై గ్రామస్థులు దాడి.. ఒకరి మృతి - maoists are attacked by villagers andhra odisha border
ఆంద్రా - ఒడిశా సరిహద్దుల్లోని చిత్రకొండ బ్లాక్ పరిధిలో మావోయిస్టులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. జొడొంబో పంచాయతీ జంతురాయ్ గ్రామానికి... శనివారం రాత్రి ముగ్గురు సాయుధ మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని తమతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. మావోయిస్టులపై గ్రామస్థులు రాళ్లు రువ్వగా... ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మావోయిస్టును మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మావోయిస్టులపై దాడి చేసిన గ్రామస్థులు
ఇదీ చదవండి:
Intro:AP_VSP_56_26_AOB_LO_MAOIST_LA_PAI_GRAMASTULU_DAADI_AV_AP10153Body:ఆంద్రా-ఒడిశా పరిధిలో మావోయిస్టులను ప్రతిఘటించిన గ్రామస్థులు, మావోయిస్టులపై గ్రామస్థులు దాడి చేయడంతో ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతిచెందగా, మరొక మావోయిస్టుకు తీవ్రగాయాలయ్యాయి.దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లోని చిత్రకొండ బ్లాక్ పరిధిలోని జొడొంబో పంచాయతీ జంతురాయ్ గ్రామానికి శనివారం రాత్రి సమయంలో ముగ్గురు సాయుధ మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఒక గిరిజనుడ్ని తమతోబాటు తీసుకెల్లడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సమయంలో మావోయిస్టులకు గ్రామస్తులకు మద్య ఘర్షణ జరిగింది. దీంతో మావోయిస్టులపై గ్రామస్థులు రాళ్లు దాడిజరపగా ఒక మావోయిస్టు అక్కడ నుంచి పరారయ్యాడు. మిగతా వారిలో ఒకరు సంఘటనాస్థలంలో మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మావోయిస్టును మల్కన్‌గిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు.Conclusion:M Ramanarao,9440715742