అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన వాల్మీకి సిద్ధలింగప్ప అనే వ్యక్తి ఒంటిపై పెట్లోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు జీవితంపై నిరాశ చెంది ఇలా చేసినట్లు తెలుస్తోంది.
మృతుని భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: