మన్యంలో చలి పులి పంజా విసురుతోంది. అక్కడ కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చింతపల్లిలో ఉదయం అత్యల్పంగా 4.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సౌజన్య తెలిపారు. గత నెల 23, 24 తేదీల్లో వరుసగా 6.5,5.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా మళ్లీ అత్యల్పంగా శనివారం 5.5, ఇవాళ 4.5 ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఆమె తెలిపారు. ఇక ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో చలి తీవ్రత భారీగా పెరిగింది. దీంతో మంచు అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. శనివారం 4.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదివారం 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Ratha Sapthami at Tirumala : తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు -తితిదే
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!