వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మధ్య అల్పపీడనం ఏర్పడి నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరంలో వైపుగా ఇది కదిలే సూచనలు ఉన్నట్ల తెలిపారు. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. యానాంలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ల వద్దని హెచ్చరించారు.