-
మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్రయోజనాల పరిరక్షణకి పోరాడాలని ఆదేశాలివ్వండి.(3/3)
— Lokesh Nara (@naralokesh) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్రయోజనాల పరిరక్షణకి పోరాడాలని ఆదేశాలివ్వండి.(3/3)
— Lokesh Nara (@naralokesh) July 8, 2021మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్రయోజనాల పరిరక్షణకి పోరాడాలని ఆదేశాలివ్వండి.(3/3)
— Lokesh Nara (@naralokesh) July 8, 2021
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..అసెంబ్లీలో జగన్ చేసిన తీర్మానం, రాసిన లేఖలు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వ చర్యలతో తేలిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయటంతోనే ఆ విషయం స్పష్టమైందన్నారు.
ఇప్పటికైనా జగన్నాటకాలు మాని.. ప్రైవేటీకరణను ఆపే ప్రయత్నం చేయాలని అన్నారు. లేకుంటే ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. వైకాపా ఎంపీల్ని తన కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా.. ఏపీ ప్రయోజనాల పరిరక్షణకు పోరాడే విధంగా జగన్ ఆదేశాలివ్వాలని అన్నారు.
ఇదీ చదవండి:
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ