ETV Bharat / state

రావికమతంలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ - visakhapatnam chodavaram latest news

కరోనా నియంత్రణలో తమవంతు బాధ్యతగా విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా పలు నియమాలు పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు రావికమతంలో గ్రామ సచివాలయంలో కార్యదర్శి పాతాళ సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

locked-down-voluntarily
రావికమతం గ్రామస్థుల సమావేశం
author img

By

Published : Jul 17, 2020, 11:12 PM IST

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో కోవిడ్19 పట్ల ప్రజలు అప్రమత్తమయ్యారు. స్వచ్ఛందంగా స్వీయ లాక్​డౌన్ విధించుకుంటున్నారు. మండల కేంద్రమైన రావికమతం గ్రామ సచివాలయంలో కార్యదర్శి పాతాళ సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు గ్రామ పెద్దలు, వ్యాపార సంస్థల యజమానులు, తదితరులు హాజరయ్యారు. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు తీర్మానాలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని నిర్ణయించారు.

పంచాయతీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దుకాణాలు తెరిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని సమావేశంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని కార్యదర్శి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, మాజీ సర్పంచ్​ కె.జగ్గారావు ఇతరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మాధవ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.