ETV Bharat / state

'నిబంధనలు పాటించండి.. మాస్కులు తప్పనిసరిగా ధరించండి' - lock down in gavaravaram

విశాఖ గ్రామీణ జిల్లాలో కొవిడ్ 19 నివారణకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై.. అవగాహన కల్పిస్తున్నారు.

lockdown in vishaka rural villeges
కొవిడ్ 19 ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
author img

By

Published : Jul 11, 2020, 3:41 PM IST

విశాఖ జిల్లాలోని చోడవరం మండలం గవరవరం గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్​డౌన్ విధించుకున్నారు. గ్రామ కార్యదర్శి పట్నాయక్ సారథ్యంలో సచివాలయ సిబ్బంది, గవరవరం పిహెచ్​సీ వైద్య సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. లేదంటే జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.

అందరూ లాక్​డౌన్ విధిగా పాటించాలని దండోరా వేయించారు. దుకాణాలను మధ్యాహ్నం రెండు గంటల వరకు మూసివేయాలని కార్యదర్శి తెలిపారు. పక్కనే ఉన్న దేవరాపల్లి మండలంలోని పొరుగు గ్రామాల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో మండల స్థాయి అధికారుల సూచనలతో లాక్​డౌన్ పాటిస్తున్నట్లు కార్యదర్శి పట్నాయక్ తెలిపారు.

ఇదీ చదవండి:

గర్భిణీని తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన ఏఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.