ETV Bharat / state

షాపులు తెరిచింది ఇప్పుడేగా.. అప్పుడే అద్దె అడిగితే ఎలా..? - విశాఖలో లాక్​డౌన్ కష్టాలు

కరోనా వచ్చి అన్ని రంగాల కొంపముంచింది. ఇక వ్యాపారుల సంగతి చెప్పనక్కర్లేదు. లాక్​డౌన్​తో దాదాపు రెండున్నర నెలలు హోటళ్లను, షాపులను మూసే ఉంచారు. సడలింపుతో ఇప్పుడు తెరచుకున్నా..వినియోగదారులు ఆశించినస్థాయిలో రావట్లేదు. మరో వైపు యజమానులు ​అద్దె కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. వ్యాపారం లేక ఇల్లు గడవడమే కష్టంగా ఉండే.. ఈ అద్దె బాధలు ఊపిరి ఆడనివ్వడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

lock down problems
lock down problems
author img

By

Published : Jun 11, 2020, 1:45 PM IST

కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశమంతటా లాక్​డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. విశాఖలో దాదాపు 78 రోజుల తరువాత కొన్ని సడలింపులతో..షాపులు, హోటళ్ల తాళాలు మళ్లీ తెరచుకున్నాయి. కానీ వ్యాపారం సరిగ్గా జరగట్లేదు. మరో వైపు అద్దె కోసం యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. హోటళ్లు తెరచుకున్నా.. కరోనా భయంతో ప్రజలు పూర్తిగా బయట ఆహారం తినడం మానేశారు. అందువల్ల గతంలో జరిగిన వ్యాపారంలో పదో వంతు కూడా జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా హోటళ్లలో శానిటైజర్, మాస్క్, హోటల్ నిర్వహణ ఖర్చులు పెరిగాయి. అందుకే యజమానులు ఈ 3 నెలలు అద్దెకి కాస్త గడువు ఇవ్వాలని హోటల్ రంగ వ్యాపారులు కోరుతున్నారు. అలాగే వచ్చే 3 నెలలు సగం అద్దె మాత్రమే కట్టగలమని చెప్తున్నారు.

మరోవైపు బస్ కాంప్లెక్స్​లో ఉండే యజమానులది మరొక సమస్య. లక్షల్లో పాడుకున్న షాపులు. డిపాజిట్లు కట్టి తెచ్చుకుని వ్యాపారం చేస్తున్నారు. కేవలం బస్ కాంప్లెక్స్ కి వచ్చే ప్రయాణికుల మీద ఆధారపడే వీరి వ్యాపారం ఉంటుంది. కరోనా వల్ల లాక్​డౌన్​తో ప్రయాణాలు నిలిపేశారు. బస్​లు తిరగడం లేదు. ప్రయాణికులు లేరు. దీని వల్ల రెండు నెలలు నుంచి వ్యాపారం లేదు. ప్రత్యేకంగా ప్రయాణికుల పై నడిచే వ్యాపారం కావడం వల్ల ఈ రెండు నెలలు పైగా నష్టాలు చూశారు. ఇప్పుడు మూడు నెలలు అద్దె కట్టాలని ఆర్టీసీ అధికారులు అడుగుతున్నారని వ్యాపారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్​లో ఉన్న దుకాణ దారులు అద్దె కట్టే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ఆర్టీసీ కాంప్లెక్స్ లో వ్యాపారం చేస్తున్న దుకాణ దారులను ఆదుకోవాలని కోరుతున్నారు.

మూడు నెలలు అద్దె మాఫీ చేసి రాబోయే రోజుల్లో అద్దెను 50% తగ్గిస్తే వ్యాపారం చేయగలం అంటున్నారు. లాక్​డౌన్​తో కుటుంబ పోషణే ఇబ్బందిగా ఉందని.. అద్దె కట్టాలని గట్టిగా పట్టు పడితే వ్యాపారం మానేసి వెళ్లిపోయే పరిస్థితి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు అద్దె చెలింపు దారుల సమస్య పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు వ్యాపారులు.

ఇదీ చదవండి: 40 అంశాల అజెండాతో మంత్రి మండలి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.