విశాఖ మన్యం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో ఉన్న ఓ మందుల దుకాణం వద్ద ప్రతిరోజు గోవులు వచ్చినప్పుడు బ్రెడ్ పెడుతుంటారు. దుకాణం వద్ద రద్దీగా ఉన్న సమయంలో కస్టమర్లు లాక్డౌన్ నిబంధనలతో భౌతికదూరం పాటిస్తూ ఉన్నారు. ఆహారం కోసం వచ్చిన ఓ ఆవు తనకూ నిబంధన వర్తిస్తుంది అనుకుందో ఏమో.. క్యూలైన్లో నిలబడింది. కస్టమర్లు వెళ్లిపోయాక ఆవుకు ఆహారం పెట్టాడు దుకాణాదారుడు. అప్పటివరకు ఎవరినీ ఏమీ అనకుండా చాలా సేపు క్యూలోనే నిలబడింది ఈ ఆవు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు