విశాఖ చోడవరంలో 144వ సెక్షన్ అమలును స్నేహపూర్వకంగా పోలీసులు నిర్వహిస్తున్నారు. రోడ్లపైకి వస్తే.. వారికి కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. తర్కించే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ద్విచక్రవాహనంపై ఒకరు మాత్రమే పయనించే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎండలో ఉంటూ రహైదారులపై పహారా చేస్తున్న పోలీసులకు స్థానికులు సంఘీభావం తెలుపుతున్నారు. సిబ్బందికి వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్‌లు అందజేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాకి పేద, ధనిక తేడాల్లేవ్.. ఎవరినీ వదలదు: మోదీ