స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర మహిళ కాంగ్రెస్ మండిపడింది. ఎస్ఈసీ తీసుకున్న ఎన్నికల వాయిదా పక్రియను తాము స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పెదడా రమణికుమారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల విధానాన్ని మెుదటి నుంచి చేపట్టాలన్నారు. నామ పత్రాల దాఖలు సమయంలో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందన్నారు. అభ్యర్ధులను భయందోళనకు గురిచేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని విషయం ముందే తెలిసి ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలతో ప్రజలను ఇబ్బందికి గురిచేయడం సమంజసం కాదన్నారు.
ఇవీ చదవండి చంద్రబాబు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి