విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణ సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. నగరంలోని మల్కాపురం హెచ్‌పీసీఎల్ గేట్ ఎదురుగా ఉన్న దుకాణంలో సిబ్బంది మద్యం సీసాలను అక్రమంగా తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణంలోని సిబ్బంది సీసాలపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు తీసివేసి దాదాపు 1,080 మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్‌కి తరలించారు. వాటి విలువ సుమారు లక్షా 90 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు.
ఇవీ చదవండి...
'ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్ వచ్చినంత మాత్రాన కరోనా లేనట్టు కాదు'